![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -58 లో.....చక్రి తన ఫ్రెండ్ ని రిక్వెస్ట్ చేసి మహా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఒక ఫేక్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత చక్రి బట్టల షాప్ కి వచ్చి నైట్ తీసుకొని వెళ్లి మహాకి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటాడు. నైటీ తీసుకుంటాడు. అప్పుడే అదే షాప్ కి కేశవ వస్తాడు. తను ఒక టవల్ కోసం వస్తాడు. అక్కడ ఉన్న ఆవిడతో చక్రి మాట్లాడడం చూసి ఎవరు కనపడితే వాళ్ళతో పులిహోర కలుపుతు ఉంటావారా అని చక్రిని కేశవ అడుగుతాడు. ఏదో మాట సాయం చేసానని చక్రి అంటాడు.
ఇంతకి ఆ అమ్మాయికి నీకు నిజంగానే పెళ్లి అయిందా అని డౌట్ అని చక్రిని కేశవ అనగానే ఆవేం మాటలు రా అని చక్రి అంటాడు. కాసేపటికి కేశవ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు కన్నా, మహా గుడికి వెళ్లి వస్తుంటే.. దారిలో గాయత్రి కన్పిస్తుంది. వాళ్ళ ఇద్దరితో సరదాగా మాట్లాడుతుంది. అప్పుడే తాయారు నీళ్ల ట్యాంక్ దగ్గర గొడవపడడం చూసి భయపడి గాయత్రీతో పాటు మహా, కన్నా వెళ్ళిపోతారు. మరొకవైపు శైలు కొత్త ఫోన్ కొనుక్కొని తన ఫ్రెండ్ కి చూపించాలని అనుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ స్కూటీపై రావడం చూసి ఒకసారి స్కూటి ఇవ్వే అని రిక్వెస్ట్ చేస్తుంది. మా అన్నయ్యది ఈ స్జూటీ అని తిడతాడని తను అనగానే శైలు రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో స్కూటీ ఇస్తుంది. ఇక స్కూటీ డ్రైవ్ చేస్తూ కేశవ బైక్ కి డాష్ ఇస్తుంది.
కేశవ, శైలుని చూసి మొన్న మూడు వేలు, ఇప్పటివి మొత్తం కలిపి ఇరవై వేలు ఇవ్వవే అని శైలుని కేశవ అడుగుతాడు. దాంతో నా తప్పేముంది అంతా మీరే చేశారని శైలు అనగానే కేశవ బెదిరిస్తాడు. దాంతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడంటూ శైలు, తన ఫ్రెండ్ ఇద్దరు గట్టిగా అరవడంతో అక్కడికి జనాలు గుమిగూడతారు. వాళ్ళు శైలు మాటలు నమ్మి కేశవని తిడతారు. ఆ తర్వాత చక్రి ఇంటికి వచ్చి మహాకి ఇంటర్వ్యూ గురించి చెప్పగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ కోసం నైటీ తీసుకొని వచ్చానని చక్రి అనగానే నాకెందుకు నైటీ.. నాకు అలవాటు లేదని మమహా అనగానే చక్రి డిస్సపాయింట్ అవుతాడు. ఆ తర్వాత కేశవ ఇంటికి వచ్చి ఒక చింపాంజీతో గొడవ అయిందని జరిగింది మొత్తం కన్నాకి చెప్తాడు. అది ఎక్కడున్నా పట్టుకొని డబ్బు వసూల్ చేస్తానని కన్నాతో కేశవ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |